తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి జయం మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ఎన్నో మూవీ లలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ము ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ కి సైతాన్ అనే టైటిల్ ను ఈ చిత్ర బృందం పరిశీలిస్తున్న ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత నితిన్ ... వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా కనిపించనుండగా ... జీ వి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించబోతున్నాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే నితిన్ ... రష్మిక ... వెంకీ కుడుమల కాంబినేషన్ లో భీష్మ మూవీ రూపొంది మంచి విజయం సాధించడంతో ... ఈ ముగ్గురి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ కాంబినేషన్   రూపొందబోయే మూవీ కథ ఇది అంటూ ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో నితిన్ మరో నెల రోజుల్లో చనిపోయే వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఇలా నెలరోజుల్లో చనిపోయే సీరియస్ కథతో నితిన్ ఈ మూవీ లో నవ్వులు పోయించనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: