తమ మొదటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అయిన 'దసరా' సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు రెడీ అయ్యాడు నేచురల్ స్టార్ నాని. ఈ సారి ఈ యంగ్ హీరో దృష్టి పాన్ ఇండియా మార్కెట్‌పై పడింది. అందుకే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసినప్పటికీ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు నాని.ఇక ఈ సినిమామార్చి 30 వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా దుమ్ములేపుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. అందుకోసం దేశమంతా కూడా తిరిగేస్తున్నాడు.సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని డైరెక్ట్ చేయగా..స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. పాటలు, టీజర్స్‌, ట్రైలర్‌తో ఈ సినిమాకి చాలా మంచి బజ్ అయితే వచ్చింది. అందుకే ఈ సినిమాకు బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుంది.


ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు దక్కించుకున్నాయి. తెలుగుతో కన్నడ, తమిళం ఇంకా అలాగే మలయాళం భాషలకు చెందిన స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకోగా..ఇక హిందీ స్ట్రీమీంగ్ రైట్స్‌ను హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం తెలిసింది. ఈ సినిమా రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. అలాగే మరో ఇంటస్ట్రింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ మూవీ క్లైమాక్స్ కోసమే ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారట.ఇక దసరా సినిమా కోసం న్యాచురల్ నాని రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం నాని ఏకంగా 20 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషకం తీసుకున్నారని సమాచారం తెలుస్తుంది.దసరా సినిమా హిట్టుతో ఇకపై నాని అంటే కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు..ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ గా కూడా దూసుకుపోతాడని నాని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: