టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని ఆఖరుగా ది వారియర్ అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ లో రామ్ కెరియర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ వేగంగా జరుగుతుంది. ఈ మూవీ కి చిత్ర బంధం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ బోయపాటిరాపో అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క విడుదల తేదీని ప్రకటించింది.

20 అక్టోబర్  2023 వ తేదీన ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రామ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ఊర్వసి రౌటెల ఒక స్పెషల్ సాంగ్ లో నటించబోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: