నేటితరం ప్రేక్షకులలో అభిరుచులు మారడంతో ఒక మంచి సినిమాను తీసే విషయంలో కూడ దర్శకుడు పూర్తి యదార్థాలను కాకుండా ఆ నిజాలను స్వీట్ కోటెడ్ పిల్ గా మార్చి సినిమా తీసినప్పుడు మాత్రమే ప్రేక్షకులు చూస్తారు అన్న విషయం ఈమధ్యనే విడుదలైన ‘బలగం’ ‘రంగామార్తాండ’ సినిమాలీ ఇండస్ట్రీకి పాఠాలు చెపుతున్నాయి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.

 

 

‘జబర్దస్త్’ వేణు దర్శకత్వం వహించిన ‘బలగం’ మూవీని కేవలం 4 కోట్ల పెట్టుబడితో తీస్తే ఆమూవీ 15 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేసి దిల్ రాజ్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కమెడియన్ గా మాత్రమే వేణుకు పేరుంది. అయితే ఒక చావును కథా వస్తువుగా తీసుకుని అందులోనే బంధాలు అనుబంధాలు సినిమా చూసే వారికి గుండెకు హత్తుకునే లా హాస్యంతో ‘బలగం’ మూవీని తీయడంలో వేణు సక్సస్ కావడంతో కొత్త దర్శకుడు అయినప్పటికీ అతడికి అనేక అవకాశాలు వస్తున్నాయి.

 

 ఇక ‘రంగమార్తాండ’ జాతీయ అవార్డు పొందిన మరాఠీ సినిమాకు తెలుగు రీమేక్. ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటీనటులు తమ పాత్రలో జీవించారు. ఇక కృష్ణవంశీ అయితే తన అనుభవాన్ని అంతా రంగరించి ఎక్కడా అశ్లీలత అన్నపదం లేకుండా చూసే ప్రేక్షకుడుకి హృదయం హత్తుకునేలా ఈమూవీని తీసాడు. ఈమూవీ పై ఇండస్ట్రీలోని ప్రతి ప్రముఖుడు ప్రశంసలు కురిపించారు.

 

 
ఇక రివ్యూలు వ్రాసిన వారైతే ఈమూవీని చూసి తీరవలసిన సినిమాగా భారీ రేటింగ్స్ ఇచ్చారు. 12 కోట్ల పెట్టుబడితో తీసిన ఈమూవీ కనీసం 4 కోట్ల కలక్షన్స్ కూడ రాబట్టలేకపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘బలగం’ సినిమా కంటే ‘రంగామార్తాండ’ లో భావోద్వేగాలు ఎక్కువ. అయితే సగటు ప్రేక్షకుడు భావోద్వేగాలను చూడటం కంటే కేవలం చావులో కూడ నవ్వును చూపించిన ‘బలగం’ మూవీని హిట్ చేసారు అంటే జనం భావోద్వేగాల కంటే జోక్స్ ను మాత్రమే ఎంజాయ్ చేద్తున్నారు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: