టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరో గా కెరీర్ ను కొనసాగించిన సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి తన కంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన మూవీ లలో "మోసగాళ్లకు మోసగాడు" మూవీ ఒకటి. ఈ మూవీ కృష్ణ కెరియర్ లోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 27 ఆగస్ట్ 1971 వ సంవత్సరం విడుదల అయింది. 

మూవీ లో విజయ నిర్మల , నాగభూషణం , గుమ్మడి , కైకాల సత్యనారాయణ , ఎం. ప్రభాకర్ రెడ్డి , ధూళిపాళ , జ్యోతి లక్ష్మి ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఆ కాలంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాను మళ్ళీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. అసలు విషయం లోకి వెళితే ...  ఈ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో 31 మే 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: