యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వీరుపాక్ష అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త మీనన్ ... సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ లను మొదలు పెట్టింది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు చాలా ఆసక్తిని కలగ జేసే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూసింగ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సాయి తేజ్ ఆకరుగా రిపబ్లిక్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. మరి రిపబ్లిక్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో విరూపాక్ష మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: