
ఇక ఆ తర్వాత గీతగోవిందం అనే సినిమాలో నటించి బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాదు ఇప్పటికీ ఎంతో మంది హీరోలకు టాలీవుడ్లో సాధ్యం కానీ 100 కోట్ల వసూళ్ల రికార్డును గీత గోవిందం తో కొట్టేశాడు. అయితే ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఎందుకో విజయ్ దేవరకొండకు మాత్రం సరైన హిట్ లభించడం లేదు. మొన్నటికి మొన్న లైగర్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇక ఆ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది అన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి గీతగోవిందం లాంటి ఒక సినిమా పడితే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.
లైగర్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒక సాలిడ్ లైన్ అప్ సెట్ చేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంతతో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిన్ననూరితో విడి12 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఇక మరో టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కి కూడా ఓకే చెప్పేసాడట విజయ్. ఇక మరోవైపు గీతగోవిందం కాంబినేషన్ రిపీట్ అయ్యేలా పరశురాంతో మరో సినిమా చేస్తున్నాడు. ఇలా ఒక సాలిడ్ లైన్ ఆఫ్ సెట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.