
ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి నాని మరియు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హాజరు రాబోతున్నట్లు తెలుస్తోంది. స్వప్న సినిమాతో వీరిద్దరికి మంచి అనుబంధం ఉండడం చేత ఈవెంట్ కి హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో స్వప్న సినిమా బ్యానర్లు వస్తున్న సినిమాలన్నీ భారీగా విజయాలను అందుకుంటున్నాయి అందుకే ఈ సినిమాకు కూడా ఇది మంచి సెంటిమెంట్ అన్నట్లుగా పలువురు నెటిజన్లు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ప్రమోషన్స్ కోసం స్టార్ హీరోలు రావడంతో పాటు పాజిటివ్ బస్ క్రియేట్ అవ్వడం వల్ల అన్ని మంచి శకునములే సినిమాకు మంచి విజయం సొంతం చేసుకుని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతున్నట్లు ఇప్పటికీ విడుదలైన ట్రైలర్ను చూస్తే మనకి అర్థమవుతుంది. స్టార్స్ తో ఈ చిత్రం ప్రచారం చేయడంతో ఈ సినిమా స్థాయి మరి ఇంత పెరిగి మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని అంతేకాకుండా గతంలో ఇది ఎన్నో సందర్భాలలో నిరూపితం అయ్యిందని చెప్పవచ్చు.