పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌ సినిమాను టి-సిరీస్ ఇంకా యువి క్రియేషన్స్ నిర్మించడం జరిగింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆదిపురుష్‌ సినిమాని తెలుగులో సమర్పిస్తోంది.ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై భారీగా అంచనాలు పెంచేసింది. దీంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని సమాచారం తెలుస్తుంది. జూన్ 6 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని తిరుపతిలో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇక అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.550 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగు హక్కులు నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి ఏకంగా 400 కోట్ల మేర బిజినెస్ ని జరిపినట్టుగా సమాచారం తెలుస్తుంది.


సినిమాకు సంబంధించి చాలా మొత్తం కూడా ఈ హక్కులతోనే వచ్చేశాయని అంటున్నారు. ఇక ఈ మూవీ డిజిటల్ శాటిలైట్ రైట్స్ కి 250 కోట్లు ఇప్పటికే ప్రొడ్యూసర్ కి వచ్చాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో ఏకంగా 185 కోట్లకి రైట్స్ ని తీసుకుంది. హిందీ, ఓవర్సీస్ ఇంకా ఇతర భాషలలో టి-సిరీస్ భూషణ్ కుమార్ సొంతంగా విడుదల చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక వసూళ్ల రూపంలో ఆదిపురుష్ సినిమా ఎంత రాబడుతుందో చూడాలి.సినిమా హిట్ అయితే ఖచ్చితంగా అనేక రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం లో నిర్వహిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. జూన్ 6 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతున్నట్టుగా మేకర్స్ తెలిపారు. కొన్ని లక్షల మంది వచ్చినా చూసే విధంగా ఆది పురుష్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ ఇంకా సన్నీ సింగ్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: