టాలీవుడ్ చిత్ర పరిశ్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు సుమంత్‌ యార్లగడ్డ గురించి పరిచయాలు అక్కర్లేదు. `ప్రేమ కథ` మూవీతో 1999లో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత్ కెరీర్ ఆరంభంలో మంచి జోరు చూపించాడు. స్టార్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వరుస ఫ్లాపులతో ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.ఐతే అయన ఈ మధ్య ఒక ముఖ ముఖి సంభాషణలో ఏయన్నార్ కుటుంబంలోని మిగిలిన వారసుల పై చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

అక్కినేని నాగేశ్వరరావు లెగసీని ఆయన తనయుడి నాగార్జున బాగానే కంటిన్యూ చేశారు. తండ్రికి తగ్గా తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు. నాగేశ్వరరావు మనవళ్లు అయిన సుమంత్‌, నాగచైతన్య, అఖిల్, సుశాంత్ స్టార్స్ గా ఎదగలేకపోయారు. అయితే తాజాగా సుమంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో బియోపిక్స్ వచ్చాయి.. వస్తున్నాయి. ఒకవేళ అక్కినేని నాగేశ్వర రావు గారి బయోపిక్ తీస్తే.. మీ ఫ్యామిలీలో ఆయన పాత్రకి ఎవరు కరెక్ట్ గా సూట్ అవుతారు..? అనే ప్రశ్న ఎదురైంది. అందుకు సుమంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. `తాత ఏఎన్నార్‌ గారి పాత్రకి నేను మాత్రమే న్యాయం చెయ్యగలను, మా ఫ్యామిలీలో ఇంకెవ్వరి వల్ల అది సాధ్యం కాదు, ఆయన పోలికలు నాకు మాత్రమే వచ్చాయి` అంటూ సుమంత్ వ్యాఖ్యానించాడు. ఏఎన్నార్‌కు అసలు సిసలైన మనవడ్ని తానే అని.. మిగిలిన వారంతా వేస్ట్ అన్నట్లు మాట్లాడటంతో సుమంత్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.ఐతే ఆయన కూడా నటన పై బాగా మెరుగులు దిద్దుకొని సెకండ్ ఇన్నింగ్స్ చేస్తే బాగుంటుందని ఈసారి సెకండ్ ఇన్నింగ్స్ ఆయనకి బాగా కలిసి రావాలని అక్కినేని అభిమానులుగా కోరుకుంటున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: