టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో హ్యాపీ డేస్ సినిమాతో రంగ ప్రవేశం చేసి ఈరోజు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుక్కున హీరో లో ఒకరు నిఖిల్. ఆయన ఈ నడుమ వెరైటీ కథలను ఎంచుకుంటున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టు లతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో.ఇక తాజాగా ఆయన నటిస్తున్న మూవీ స్పై. ఇందు లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి రీసెర్చ్ చేసే స్పై పాత్రలో నటిస్తున్నాడు నిఖిల్. చనిపోయిన తర్వాత నేతాజీ అస్తికలు ఏమయ్యాయి అనే కోణంలో సినిమాను తీస్తున్నారు.ఇప్పటి కే విడుదలైన టీజర్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీని ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్టు నిఖిల్ తాజా గా తన పోస్ట్ లో వెల్లడించారు. ఇది చూసిన ఓ నెటిజన్ ప్రాపగాండ స్టార్ అంటూ నెగెటివ్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ఇండియా విలన్ సావర్కర్ అంటూ కామెంట్ చేశాడు. ఇలా రకరకాలుగా ఆయన్ను నెగెటివ్ కామెంట్ల తో తిట్టిపోస్తున్నారు.ఇందుకు కారణం కూడా ఉంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి నిర్మాణం లో వస్తున్నది ఇండియా హౌజ్ః సావర్కర్ అనే సినిమాలో నిఖిల్ నటిస్తున్నాడు. ఈ సినిమా ను సావర్కర్ జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు. సావర్కర్ ను మన దేశంలో కొందరు స్వాతంత్య్ర పోరాట యోధుడిగా చూస్తే.. మరికొందరు మాత్రం ఇండియా వ్యతిరేకిగా చూస్తారు.ఆయన్ను అభిమానించే వారికంటే ధ్వేషించే వారే ఎక్కువ గా ఉంటారు. అందుకే నిఖిల్ పై ఇప్పుడు నెగెటివిటీ బాగా పెరిగిపోతోంది. ఈ సినిమా ఎఫెక్ట్ స్పై సినిమాపై కూడా పడుతోంది. ఒక రకం గా ఇది ఆయన్ను చిక్కుల్లో పడేస్తోంది. మొహమాటానికి ఒప్పుకుని నిఖిల్ తప్పు చేశాడా అని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: