గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న హీరో శ్రీ విష్ణు తాజాగా సామజ వరగమన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రేపటి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. అయితే కిందన సబ్ క్యాప్షన్ కింద దొంగ.. ము.. డ అనే పదంతో పాటు ఇంగ్లీష్ టైటిల్ని కూడా తొలగించమని తెలియజేసింది.. ఇవే కాకుండా పలు రకాల పదాలను కూడా కట్ చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమా రన్ టైం రెండు గంటల 20 నిమిషాలు అన్నట్లుగా తెలుస్తోంది.


అయితే ఈ సినిమాలో ఇలాంటి కొన్ని పదాలు వినిపించాయని వెబ్ సిరీస్ ఓటీటి లలో సినిమాలలో అయితే లెక్కకు మించి ఇలాంటి పదాలు వినిపిస్తూనే ఉన్నాయి.. అయితే ఆ సినిమాలకు క్లీన్ యు సర్టిఫికెట్ రాలేదు. సామజ వరగమన సినిమాకు మాత్రం క్లీన్ యు ఇవ్వకపోవడం కోసం తొలగించామని తెలియజేశారు.. సామజవరగమన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసుకున్న కొన్ని నగరాలలో కుటుంబ ప్రేక్షకులకు సైతం చూపించినట్లు తెలుస్తోంది. వాళ్ల నుంచి కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ లభించినట్లు సమాచారం.


తెలుగు సినిమా అడ్డా హైదరాబాద్ సిటీలో విడుదలకు ఒక్కరోజు ముందు నుంచే షోలు వేశారు అంటే ఈ రోజున రాత్రి ప్రీమియం షోలకు అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి రేపటి రోజున ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. సామజ వర గమన ట్రైలర్ విడుదలయ్యి బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.. ఇందులో బాలు పాత్రలో హీరో శ్రీ విష్ణు నటించగ ఆయనకు తండ్రిగా సీనియర్ నరేష్ కనిపించారు.. హీరోయిన్  గా రెబ్బ మౌనిక జాన్ నటించడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని డైలాగ్స్ కూడా ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని శ్రీ విష్ణు అందుకుంటారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: