
ఇక వైయస్సార్ మరణం తర్వాత ఆ తర్వాత చేసుకున్న పరిణామాలు జగన్ పాదయాత్ర తదితర అంశాల పైన యాత్ర -2 సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటిదాకా ఈ సినిమా పైన ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇటి వలే మహి వి రాఘవ పలు వెబ్ సిరీస్ లను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి యాత్ర-2 సినిమా పేరు నెట్టింట వైరల్ గా మారుతోంది.. వైయస్సార్ జయంతి సందర్భంగా జులై 8వ తేదీన యాత్ర-2 అప్డేట్ రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
కానీ తాజాగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలిపారు డైరెక్టర్ మహీవి రాఘవ యాత్ర-2 రిలీజ్ డేట్ ని ఒక పోస్టర్ ద్వారా విడుదల చేసి ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో యాత్ర సీక్వెలను ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్ ఈ చిత్రానికి భారీగా అంచనాలను పెంచేస్తోంది.. ముఖ్యంగా నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. అనే లైన్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో నటీనటుల గురించి అప్డేట్ ఇస్తారేమో చూడాలి మరి.