విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి శివ నార్వన దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు .
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వం లో రూపొందుతున్న జవాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు . ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది .
రామ్ పోతినేని హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు .
రాఘవ లారెన్స్ హీరోగా పి వాసు దర్శకత్వం లో రూపొందుతున్న చంద్రముఖి 2 మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నారు.
సిద్దు జొన్నలగడ్డ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి