కొంతమంది నటులు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. దీంతో వారికి సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ అలాంటి వారికి అదృష్టం చాలా తక్కువ. అందుకే అవకాశాలు రాక పెద్దగా సినిమాల్లో నటించరు. కానీ మొదటి సినిమాతో వారికి వచ్చిన గుర్తింపు ఎన్నటికీ మరచిపోలేనిది. కాలేజ్ ఫ్రెండ్షిప్ లవ్ నేపథ్యంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాల్లో ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది. అయితే వారిలో అప్పు పాత్ర సైతం బాగా ఫేమస్ అయ్యింది. హ్యాపీడేస్ సినిమాలో నటించిన అప్పు దాని తర్వాత రెండు మూడు సినిమాలు లో కనిపించింది.

 అయితే ఈ అప్పు కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమెను చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. శేఖర్ కమ్ముల ఎప్పుడు కొత్త నటనతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉంటాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న వారు శేఖర్ కమ్ములను సంప్రదిస్తే చాలు వాళ్ళ జాతకాలు మారిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఆయన ద్వారా చాలామంది సినీ ఇండస్ట్రీకి నటీనటులుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక వారిలో కొందరు మాత్రమే కొనసాగుతున్నారు. మరికొందరు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. 

అలా ఫీల్ గుడ్ లవ్ సినిమా గా శేఖర్ కమ్ముల 2007లో మంచి లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఇక అది హ్యాపీడేస్ సినిమా. ఆరోజుల్లో కళాశాలలో జరిగే పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఆయన ఈ సినిమాను తెరకెక్కించాడు. కమర్షియల్ గా  ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో అప్పు పాత్రలో చేసిన నటి ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. ఆ పాత్రలో కనిపించిన ఆ అమ్మాయి పేరు గాయత్రి రావు. ఫస్ట్ సినిమాతోనే మంచి నటిగా గుర్తింపును తెచ్చుకున్న ఈమె దాని తర్వాత గబ్బర్ సింగ్ ఆరెంజ్ వంటి సినిమాల్లో నటించింది. దాని తర్వాత అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది గాయత్రి రావు. అయితే హ్యాపీడేస్ సినిమాలో ఎంతో అందంగా ఉన్న ఈమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఆమెను చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: