పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరో గా బాహుబలి 2 తర్వాత వచ్చిన సినిమా లన్నీ కూడా భారీ బడ్జెట్ లో తెరకెక్కి భారీ డిజాస్టర్ గా నిలిచాయి. సాహో సినిమా కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా  రాధేశ్యామ్‌, ఆదిపురుష్ సినిమాల ఫలితాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఆ సినిమాలు చాలా నష్టాలు మిగిల్చాయి.అలాంటి అట్టర్ ప్లాప్ సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది అనేది అందరిలో కూడా ఇప్పుడు బాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరోగా ప్రభాస్ త్వరలో సలార్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం లో ఒక సినిమా వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మారుతి వంటి దర్శకుడితో సినిమాను చేసే ప్రయోగం అసలు చేయలేను అంటూ ప్రభాస్ ఒక నిర్ణయానికి వచ్చాడు అంటూ సమాచారం తెలుస్తుంది.


అందుకే ఇప్పటికే పూర్తి అయిన షూటింగ్ ను పక్కకు పెట్టి మరీ ఆ సినిమాను ఆపేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.ఒక వేళ సలార్, ప్రాజెక్ట్‌ కే సినిమా లు హిట్ అయితే అప్పుడు తప్పకుండా మారుతి దర్శకత్వం లో సినిమాను మొదలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు.మొత్తానికి ప్రభాస్‌  మారుతి కాంబోలో ఇక సినిమా లేనట్లే అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఇప్పటికే సినిమా షూటింగ్‌ స్టార్ట్ అయింది... కొంత  షూటింగ్‌ కూడా అయిపోయింది.కాబట్టి వాయిదా వేయడం కానీ క్యాన్సిల్‌ చేయడానికి కాని లేదు అని అంటున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన ఈ సినిమాను అలా ఉన్నపలంగా ఆపేయడానికి లేదు.కాబట్టి ఖచ్చితంగా సినిమాను పూర్తి చేస్తారని కొందరు అంటున్నారు.వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: