గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైవిధ్యమైన దర్శకుడు నాగ్ అస్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్టు-కే  ఇంతకీ ప్రాజెక్టు-కే అంటే ఏంటి అన్న విషయాన్ని ఇటీవల చిత్ర బృందం రివీల్ చేసింది. కల్కి 2898 ఏడి టైటిల్ తో ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాపై యావత్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు ఉంది అని చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం కూడా నటిస్తూ ఉండడం గమనార్హం.


 బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్, బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే ఈ సినిమాలో నటిస్తూ ఉండగా.. ఇక లోకనాయకుడు కమలహాసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఇంతటి భారీ తారాగణం ఉండడంతో సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇకపోతే ఇటీవలే అమెరికాలోని శాండీయాగో కామికాన్ ఈవెంట్లో టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ ని కూడా చిత్ర బంధం విడుదల చేసింది.  ఈ క్రమంలోనే ఓ హాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఏకంగా ఈ సినిమాలో తన పాత్రతో పాటు సినిమా కాన్సెప్ట్ ఏంటీ అనే విషయాన్ని కూడా చెప్పేసారు.


 పురాణాలను, భవిష్యత్తును కలబోసి నాగ్ అశ్విన్ గొప్ప కథను తయారు చేశాడు అంటూ కమల్ చెప్పుకొచ్చాడు. మనమందరం వేల సంవత్సరాలుగా పురాణాలను అనుసరిస్తున్నాం. వాటి గొప్పతనాన్ని ఈ సినిమాలో నాగ్ అశ్విన్ మరింత గొప్పగా చూపించబోతున్నాడు. ఈ సినిమాలో తాను నటిస్తానని ఎవరు ఊహించలేదు. ప్రభాస్ సైతం తనతో ఇదే విషయాన్ని అన్నాడు. ఈ సినిమాకు తనను ఎలా ఒప్పించారనేది ఆశ్చర్యంగా ఉందంటూ ప్రభాస్ తెలిపాడు. పురాణాల గొప్పతనాన్ని ఈ తరానికి చెప్పే విధానం తనకు ఎంతో నచ్చింది. అందుకే విలన్ రోల్ లో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చాడు కమల్ హాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: