ఈ సంవత్సరం ఆగస్టు నెలలో కొన్ని క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

బిజినెస్ మేన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2012 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఈ సంవత్సరం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు.

జైలర్ : రజనీ కాంత్ హీరోగా తమన్నా హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

భోళా శంకర్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు.

కింగ్ ఆఫ్ కొత్త : దిల్కర్ సల్మాన్ హీరో గా రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 18 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

గాంధేవధార అర్జున : వరుణ్ తేజ్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో రూపొందిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నారు.

బెదురులంక 2012 : కార్తికేయ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ 6 సినిమాలపై కూడా తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఏ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: