
థియేటర్లలో బాగానే ఆకట్టుకుని యావరేజ్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఓటీటి హక్కులను ఆహా సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆహా ఓటీటి మేకర్ మాస్క్ వెనుక ఉన్న మనిషి ఎవరు అంటూ ఒకసారి కొత్త పోస్టర్ని రివిల్ చేయడం జరిగింది. అయితే ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విధంగా కనిపిస్తోంది. ఇందులో అశ్విన్, నందిత ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.
మకరంత్ దేశ్ పాండే ,శ్రీనివాసరెడ్డి, రాజీవ్ కనకాల ,శుభలేఖ సుధాకర్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే హైదరాబాదులో కొంతమంది మహిళలు వరుసగా కిడ్నాప్లకు గురవుతూ ఉంటారు ఈ వెనుక ఉన్న మిస్టరీ ఏంది స్పెషల్ ఆఫీసర్గా నందిత అశ్విన్ బాబు రంగంలోకి దిగిన తర్వాత అసలు ఊహించని అనుభవాలు ఎదురవుతాయట.. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో హిడింబ అనే చిత్రాన్ని తెరకెక్కించారు అంతేకాకుండా హిడింబ అనే ఒక తెగకు చెందిన క్రూరమైన వ్యక్తి జన సంచారంలోకి వస్తే ఎలా ఉంటుంది వరుసగా తప్పిపోతున్న మహిళలకు హీడింబ తెగకు సంబంధమేంటి అనే విషయంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.