తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ తాజాగా బెదురులంక 2012 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... క్లాక్స్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ లభించింది. దానితో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 42 లక్షల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 23 లక్షలు , యు ఏ లో 20 లక్షలు , ఈస్ట్ లో 12 లక్షలు , వెస్ట్ లో 7 లక్షలు , గుంటూరు లో 14 లక్షలు , కృష్ణ లో 12 లక్షలు , నెల్లూరులో 6 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 80 లక్షల షేర్ , 1.36 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని 27 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 94 లక్షల షేర్ ... 1.63 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 4.10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 4.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ మరో 3.56 కోట్ల షేర్ కలక్షన్ లను వరల్డ్ వైడ్ గా సాధించినట్లు అయితే ప్రపంచ వ్యాప్తంగా హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: