
ఇందులో నటించిన ప్రతి ఒక్క హీరోయిన్లు కూడా తమ అందం తో ఈ సినిమాకి మరింత వన్నె తెచ్చారని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యరాయ్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండే పాత్ర లే వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమం లోనే తాజా గా తెలుగు లో ఐశ్వర్యరాయ్ ను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు సంప్రదించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అది కూడా చిరంజీవి నటిస్తున్న 157 వ చిత్రానికి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం లో ఈ సినిమా లో నటించబోతున్నారు. గత రెండు రోజులనుంచి హీరోయిన్ అనుష్క శెట్టి పేరు వినిపించగా కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులలో బిజీ గా ఉందని ఇందు లో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. అందులో మరొక హీరోయిన్ ఐశ్వర్య రాయిని తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐశ్వర్య తెలుగు లో నటించడానికి ఒప్పుకుంటుందో లేదో అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ని రంగం లోకి దింపేందుకు సిద్ధం కాబోతున్నారట.. చరణ్ అమితాబచ్చన్ కి మంచి స్నేహబంధం ఉండడం తో ఆయన ద్వారా వర్తిస్తే ఐశ్వర్య కచ్చితంగా ఈ సినిమా లో నటిస్తుందట. మరి ఇందు లో ఎంత నిజమో తెలియాల్సి ఉన్నది.