కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న నయనతార ఒకపక్క వైవాహిక జీవితం చూసుకుంటూనే మరొక పక్క వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కలిసి నటించిన జవాన్ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించింది నయనతార. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం విజయపథంలో దూసుకుపోతుంది. అలా ఈ సినిమా కొనసాగుతుండగానే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళింది . నయనతార ప్రధాన పాత్రలో డ్యూడ్ విక్కీ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ఒక సినిమా తీస్తోంది. 

కోర్టు డ్రామాగా వస్తున్న ఈ సినిమా పేరుని రిలీజ్ చేస్తూ నిన్న సాయంత్రం మోషన్ పోస్టర్ని సైతం విడుదల చేశారు మేకర్స్. 'మన్నన్ గట్టి Since 1960' అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రిన్సి పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్ అనే నిర్మాత ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను సైతం ప్రారంభించబోతున్నారు. అయితే ఈ సినిమాతో పాటు నయనతార చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంది. వాటిలో ఇరైవన్ జయం రవి కాంబినేషన్లో వస్తున్న 'తని ఒరువన్ 2' అలాగే లేడీ సూపర్ స్టార్ 75 సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. 

అయితే నయనతార తో జట్టుగా పెళ్లి అయిన కొంతమంది స్టార్ హీరోయిన్స్ మాత్రం ఒకటి రెండు సినిమాలు చేయడమే కష్టంగా మారిన ఈ సమయంలో నయనతార మాత్రం సినిమాల మీద సినిమాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంది. అలా ప్రస్తుతం నయనతార వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఇక జవాన్ సినిమా బాలీవుడ్ లో ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. దాంతో నయనతారకి ప్రస్తుతం బాలీవుడ్లో సైతం వరుస సినిమా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: