సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.  కానీ కొంతమంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుని ప్రేక్షకులందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే సాధారణంగా సినిమాల్లో కమెడియన్స్ గా నటిస్తున్న వ్యక్తులు ఇక ప్రేక్షకులను నవ్వించాలి అంటే ఏం చేస్తారు ఇంకేం చేస్తారు ఫన్నీ డైలాగులు చెప్పి ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి పంచ్ డైలాగులు చెప్పలేదు అంటే.. కమెడియన్స్ ఏం చెప్పినా కూడా ప్రేక్షకులు నవ్వరు. కానీ ఇదంతా ఒక్క కమెడియన్ విషయంలో మాత్రం రివర్స్ లో ఉంటుంది. ఆయన అందరిలాగా భారీ డైలాగులు చెప్పాల్సిన పనిలేదు. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తెర మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు.


 ఆయన చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చిన కూడా ప్రేక్షకుల పొట్ట చెక్కలవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఆయన ఎవరో కాదు టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. ఇప్పుడు వరకు తన కామెడీతో ప్రేక్షకులు అందరిని కడుపుబ్బా నవ్వించారు. ఇక ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా ఇప్పటికీ హవా నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వరకు ఏకంగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించాడు బ్రహ్మానందం. అయితే బ్రహ్మానందం నటించిన ఎన్నో సినిమాలలో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ గా కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి మూవీస్ లో మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు మూవీ కూడా ఒకటి.


 ఫస్టాప్ మొత్తం అటు మహేష్ బాబు మీద ఉంటే..  సెకండ్ హాఫ్ మొత్తం బ్రహ్మానందం మీదే కథ నడుస్తుంది. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ వల్లే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనడంలో సందేహం లేదు. అయితే ముందుగా శ్రీను వైట్ల ఈ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ రాసుకోలేదట. కానీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమాలో బ్రహ్మీ ఉంటే బాగుంటుందని భావించి.. స్పెషల్ గా ఆయన కోసం ఒక క్యారెక్టర్ రాసాడట శ్రీనువైట్ల  అలా ఈ సినిమాలోకి బ్రహ్మానందం క్యారెక్టర్ వచ్చిందట. ఇక ఈ క్యారెక్టర్  సినిమాను ఎంతలా ప్రభావితం చేసి హిట్ అయ్యేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: