సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు ప్రేక్షకులు చాలా ఎగబడి చూస్తున్నారు. గతంలో విడుదలైన సినిమాలను రిలీజ్ చేస్తూ సరికొత్త కలెక్షన్స్ తో రికార్డు సృష్టిస్తున్నారు. గతేడాది నుంచి ఎక్కువగా ఇలాంటి సినిమాలు విడుదలై విజయవంతంగా కొనసాగుతున్నాయి. మరికొన్ని చిత్రాలు గతంలో సరిగ్గా ఆడకపోయినా రీ రిలీజ్ అయ్యి బాగా హవా కొనసాగిస్తున్నాయి. మన స్టార్ సినిమాలను అందించడం ఒక ఎత్తు అయితే డబ్బింగ్ చిత్రాల కోసం కూడా ఇలాగే వెయిటింగ్ చేస్తున్నారు అభిమానులు. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ ,సూర్య సన్నాఫ్ కృష్ణ న్,3 వంటి సినిమాలు విడుదలై బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే ఈ వారం వచ్చిన 7/G బృందావన కాలనీ సినిమాకి మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. 19 ఏళ్ల క్రిందట ప్రేక్షకులను బాగా మతులు పోగొట్టిన ఈ సినిమా శుక్రవారం రీ రిలీజ్ కావడం జరిగింది. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రమోట్ చేయడం కొత్తగా రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయడం వంటివి చేయడం జరిగింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 1250 కి పైగా షోలు వేయడం జరిగింది. ఈ చిత్రం కలెక్షన్ పరంగా భారీగా దూసుకుపోతోంది. హైదరాబాదులో పలు థియేటర్లలో ఉదయం 8 గంటలకు షోలు వేశారు..అవన్నీ కూడా హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయట. త్వరలోనే 7/G బృందావన కాలనీ సీక్వెల్  తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వారం కొత్త సినిమాలు విడుదల తేదీ లేకపోవడంతో 7/G బృందావన కాలనీ సినిమా మంచి పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా వైజాగ్ హైదరాబాదు అంటే ప్రాంతాలలో అద్భుతమైన స్క్రీనింగ్ తో ఆక్యుపెన్సితో పలు ఏరియాలలో మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కలెక్షన్ల పరంగా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: