
ఈ మూవీ నుంచి కొత్త ట్రైలర్‌ను ఈరోజు జరుగబోయే స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. దీనికి సంబంధించి ప్రోమో ను విడుదల చేయగా ఈ ప్రోమోలో ”నువ్వేం కావాలి అనుకుంటున్నావు అని టీచర్ రామ్ ని అడిగితే.. సీఎం కావాలి అనుకుంటున్నా అని షాకింగ్ రిప్లయ్ ఇస్తాడు. ఎందుకు అంటే. ఆ పోస్టుల దమ్ముంది సార్. ఎటు వెళ్లిన కూడా ట్రాఫిక్ సిగ్నల్ లొల్లి ఉండదు, పైప్ పెట్టి ఊదుడు ఉండదు. మన బర్త్‌డే అయితే స్టేట్ మొత్తం మన ఫ్లెక్సీలు లేస్తాయి. అంటూ రామ్ పోతినేని చెప్పిన డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది.