సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వాటిలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ఇక మహేష్అభిమానులందరికీ కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచే సినిమా కూడా ఒకటి ఉంది. అదే దూకుడు. మహేష్ బాబును ఎలా అయితే ప్రేక్షకులు చూడాలి అనుకున్నారో ఇక దూకుడు సినిమాలో అలాంటి క్యారెక్టర్ ని శ్రీనువైట్ల అభిమానులకు అందించాడు   దూకుడు సినిమా విడుదల 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.



 అయితే పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబుకు ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయ్. అలాంటి సమయంలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా అయితే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ కలిగిన పాత్రల్లో అదరగొడతాడు అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.  హీరోయిన్ సమంతతో మహేష్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


 అయితే ఈ సినిమా విడుదలైన 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు దూకుడు సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. దర్శకుడు శ్రీనువైట్ల హీరో తండ్రి పాత్ర కోసం ముందుగా దివంగత నటుడు శ్రీహరిని అనుకున్నాడట. అయితే అప్పుడప్పుడే శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నాడు. దీంతో ఇక శ్రీహరి అయితేనే ఆ పాత్రకు బాగుంటుందని అనుకున్నాడట. శ్రీహరికి ఈ విషయం చెప్పాడట డైరెక్టర్ శ్రీనువైట్ల.  కానీ అప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న శ్రీహరి ఆ పాత్ర కోసం ఒప్పుకోలేదట. ఏకంగా హీరో తండ్రి పాత్ర చేస్తే తర్వాత కూడా తనకు అలాంటి పాత్రలే వస్తాయని శ్రీనువైట్ల ఆఫర్ ను వదులుకున్నాడట. అయితే తండ్రి పాత్రను అన్నయ్య పాత్రగా మారుస్తానని.. శ్రీను వైట్ల చెప్పాడట. కానీ శ్రీహరి మాత్రం ఒప్పుకోలేదట. ఇక శ్రీహరి తప్పుకోవడంతో ఆ పాత్ర ప్రకాష్ రాజుకు వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి: