సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు ఉన్న స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఏ సినిమాలో నటించిన ఆ సినిమాకు హిట్ ... ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లు వస్తూ ఉంటాయి. ఇకపోతే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తుండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత మహేష్ , ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిపోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ మొదలు కాకముందే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ మూవీ తర్వాత మహేష్ నటించబోయే సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం మహేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే ఇప్పటికే సరిలేరు నీక్కెవ్వరు సినిమాతో తనకు మంచి విజయాన్ని అందించిన అనిల్ రావిపూడి కి మరో అవకాశాన్ని మహేష్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అనిల్ కూడా మహేష్ కోసం అదిరిపోయే రేంజ్ కథను రెడీ చేస్తున్నట్లు అన్నీ కుదిరితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ తో అనిల్మూవీ తెరకెక్కించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: