తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా సినిమాలను పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన ఏకంగా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సంవత్సరం కూడా మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ , మీటర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

నేహా శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా రత్నం కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు ట్రైలర్ ను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాలు నుండి పరవాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభించింది.

మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. మీటర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను అందుకున్న ఈ నటుడు రూల్స్ రంజన్ మూవీ తో తిరిగి ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: