రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి అటు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. 2011లో వచ్చిన నువ్విలా సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. అటు వెంటనే పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అవతారమెత్తి మొదటి సినిమాతోనే విజయాన్ని సాధించాడు. ఇక అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు అమ్మాయిల మనసు దోచేసిన హీరోగా కొనసాగుతూ ఉన్నాడు  సాదరణ ప్రేక్షకులు మాత్రమే కాదు హీరోయిన్స్ సైతం అటు విజయ్ దేవరకొండను ఒకసారి కలిసిన చాలు అని కోరుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే గీత గోవిందం, టాక్సీవాలా సినిమా తర్వాత విజయ్ ఎన్నో సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలు సాధించలేకపోయాడు. ముఖ్యంగా లైగర్ లాంటి డిజాస్టర్ విజయ్ కెరియర్ను ఒక్కసారిగా డ్రాప్ అయ్యేలా చేసింది. ఖుషి సినిమా అంతంత మాత్రం విజయాన్ని మాత్రమే అందుకుంది అని చెప్పాలి. అయితే తర్వాత సినిమాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హిట్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు విజయ్ దేవరకొండ.


 జెర్సీ ఫేమ్ గౌతం తిన్న నూరుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి  అయితే ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ను కన్ఫార్మ్ చేయలేదని చర్చ నడుస్తుంది. అయితే ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నప్పటికీ శ్రీలీల డేట్స్ ఖాళీ లేక సినిమా నుంచి తప్పుకున్నట్లు పుకార్లు షికార్లు చేశాయ్. నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమాలో నటిస్తుందట. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో విజయ్ మాఫియా లీడర్ గా కనిపించబోతున్నాడట. కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్ గా ఎదిగిన వ్యక్తి కథే ఈ సినిమా స్టోరీనట.

మరింత సమాచారం తెలుసుకోండి: