తలపతి విజయ్ , లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో లియో అనే ఓ భారీ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ క్రేజియేస్ట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు రెండు పాటలను విడుదల చేశారు. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

ఇకపోతే ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చిత్ర బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్ లో విజయ్ చేతిలో ఓ పొడవాటి కత్తి పట్టుకొని ఓ భారీ జంతువుతో పోరాడుతున్నాడు. ఇందులో విజయ్ వెన్నులో రక్తం కనిపిస్తోంది. ఇకపోతే ఈ పోస్టర్ ఈ సినిమాలోని ఓ అదిరిపోయే యాక్షన్ సీన్ లోడి అని అర్థం అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: