మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వాల్టేరు వీరయ్య అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ , చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించనుండగా ... మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ప్రకాష్ రాజ్ , బాబి సింహ ఈ సినిమాలో విలన్ పాత్రలలో నటించారు.

ఇక ఈ మూవీ లో రవితేజ ఓ కీలకమైన పాత్రలో నటించగా ... సత్య రాజ్ ఈ మూవీ లో చిరంజీవి కి తండ్రి పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంతగానో అల్లరించి భారీ విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికి "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని దసరా సందర్భంగా బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు జెమినీ సంస్థ వారు తాజాగా ప్రకటించారు. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: