
అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడం మ్యూజియంలో కాకుండా దుబాయ్ లోని మ్యూజియంలో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఈ మ్యూజియంలో ప్రదర్శితం కానున్న మొదటి తెలుగు మైనపు బొమ్మ కూడా ఇదే కావడం గమనార్హం. అయితే అక్కడ ఉండబోయే విగ్రహం ఎలా ఉండబోతుంది అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. అందుతున్న సమాచారం ప్రకారం అలా వైకుంఠపురం లోని సినిమాలో రెడ్ జాకెట్ లో ఉన్న అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ గ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు.
ఇప్పటివరకు మేడం మ్యూజియంలో మన తెలుగు హీరోలలో మహేష్, ప్రభాస్ మైనపు విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ గౌరవాన్ని అందుకోవడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. అల్లు అర్జున్ కూడా జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.. అందుతున్న సమాచార మేరకు మొట్టమొదటి టాలీవుడ్ యాక్టర్ గా నేను సంచలనాలను సృష్టించారు. అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగంలో నటనకు గాన ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ జరుగుతోంది మరి ఈ సినిమా మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15 విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది.