విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ దర్శకుడు ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ.ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ తో రీమేక్ చేశాడు.  ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయం సాధించింది. దానితో ఈ దర్శకుడి కి హిందీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక ప్రస్తుతం సందీప్ "యానిమల్" అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా ... రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. 

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ లోని మొదటి పాటను ఈ చిత్ర బృందం వారు విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా హక్కులను నిర్వణ సినిమాస్ మరియు మోక్ష మూవీస్ సంస్థల వారు దక్కించుకున్నట్లు ఈ సినిమాను వారు నార్త్ అమెరికాలో విడుదల చేయనున్నట్లు తాజాగా మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: