సాధారణం గా ఒక సినిమా తీస్తున్నాము అంటే చాలు నిర్మాతలు అన్ని విషయాల్లో కూడా పక్కా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. సినిమా హీరో ఎవరు? ఆ హీరోకి ఎంత మార్కెట్ ఉంది? ఎంతవరకు బడ్జెట్ పెట్టవచ్చు అని ముందుగానే లెక్కలు వేసుకొని ఇక బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది హీరోల మీద నమ్మకంతో ఇక కాస్త రిస్క్ చేసి ఎక్కువ బడ్జెట్ పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు నిర్మాతలు. ఇలాంటి రిస్క్ కొన్నిసార్లు వర్కౌట్ అయితే ఇంకొన్నిసార్లు మాత్రం చివరికి నష్టాలపాలు చేస్తూ ఉంటుంది.



 అయితే వరుస విజయాలు సాధిస్తున్న హీరో పై ఇలా కాస్త రిస్క్ చేసి అయినా సరే బడ్జెట్ ఎక్కువ పెట్టొచ్చు. కానీ అసలు హిట్టు అనే పదానికే దూరం అయిపోయి వరుస ప్లాపుల తో సతమతమవుతున్న హీరో పై భారీ బడ్జెట్ పెట్టాలి అంటే అది నిజంగా రిస్క్ చేయడమే అవుతుంది. ఇక ఇప్పుడు శర్వానంద్ పై ఇలాగే భారీ బడ్జెట్ పెట్టి రిస్క్ చేయబోతున్నారట నిర్మాతలు. ఇటీవల గోపీచంద్ లాంటి మార్కెట్ లేని హీరో పై 35 కోట్లు పెట్టిన పీపుల్స్ మీడియా.. ఇక ఇప్పుడు శర్వానంద్ పై ఏకంగా 45 కోట్లు పెట్టబోతుందట. అయితే శర్వానంద్ సినిమాలకు 20 కోట్లు రావడమే జరిగే పని కాదు. ఇప్పుడు సినిమా యావరేజ్ అని టాక్ వచ్చిందా జనాలు థియేటర్లకు రావడం లేదు. మరి ఏ నమ్మకంతో ఫ్లాప్ హీరోగా ఉన్న శర్వానంద్ పై పీపుల్స్ మీడియా అంత పెట్టుబడి పెడుతుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అంటే శర్వానంద్ మీద పెట్టిన 45 కోట్లకు లాభాలు రావాలంటే సినిమా 50 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: