తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

అలాగే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం కొంత కాలం క్రితం ఒక చిన్న వీడియోను విడుదల చేయగా దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల లభించింది. ఇలా ఇప్పటి వరకు ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మూడవ సాంగ్ విడుదల తేదీని ... సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

మూవీ లోని మూడవ పాటను ఈ రోజు అనగా నవంబర్ 28 వ తేదీన సాయంత్రం 5 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ సాంగ్ ను ఒకే సారి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ మూడో సాంగ్ పై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: