
యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 1 వ తేదీన విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కి కనుక హిట్ టాక్ వచ్చినట్లు అయితే భారీ కలక్షన్ లను వరల్డ్ వైడ్ గా రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
కాలింగ్ సహస్ర : సుడిగాలి సుదీర్ ప్రధాన పాత్రల రూపొందిన ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్.2 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 23 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అధర్వ : ఈ మూవీ ఈ రోజు అనగా డిసెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "యు / ఎ" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ ఒక గంట 56 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
విక్రమ్ రాథోడ్ : విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 1 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి "యు / ఎ" సర్టిఫికెట్ లభించగా... ఈ మూవీ 2 గంటల 16 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.