ప్రతి సంవత్సరం చాలా మంది నటీమణులు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే అందులో చాలా తక్కువ మంది మాత్రమే కెరియర్ ను ప్రారంభించిన చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపును ... మంచి విజయాలను అందుకుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ బ్యూటీ రెబా మోనిక జాన్ ఒకరు. ఈమె ఈ సంవత్సరం విడుదల అయినటువంటి "సామజవరగమన" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. 

శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా ... నరేష్ , వెన్నెల కిషోర్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. అలాగే ఈ మూవీ లో మౌనిక కూడా తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ నటికి ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. మౌనిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తనకు సంబందించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మోనిక అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని క్లాస్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: