హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన తన కెరియర్ లో ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. అయినప్పటికీ ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. 

వాటితో ఈ నటుడి కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హృతిక్ "ఫైటర్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని సంబంధించిన హృతిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఈయన అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... దీపికా పదుకొనే ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ కపూర్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... విశాల్ శేఖర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ పై హిందీ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా హిందీ ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: