
2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ గా అవుతారని చెప్పారు. చంద్రబాబు నాయుడు కచ్చితంగా జైలుకు వెళ్తారని ఇలా ముందుగానే వేణు స్వామి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది.ఈ రకంగా తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పినా జోష్యం ఇటీవలే ఫెయిల్ కావడంతో తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఈ విషయం పైన వేణు స్వామి పై చాలా దారుణంగా ట్రోల్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జాతకాల గురించి పలు విషయాలను తెలియజేశారు.
వీరిద్దరి జాతకంలో గురువు శుక్రుడు నీచంగా ఉన్నారని.. తనకు తెలిసి వారిద్దరు భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా లేవని లావణ్య త్రిపాటికి కుజదోషం ఉన్నది. వరుణ్ తేజ్ కు నాగదోషం ఉన్నది కాబట్టి ఇద్దరు కుటుంబాల ఒక ప్రముఖైన స్త్రీ వల్ల వీరిద్దరూ విడిపోతారని ఉందంటూ తెలియజేశారు. గతంలో నాగచైతన్య, సమంత చెప్పినట్టుగానే విడిపోవడంతో ఇప్పుడు మెగా అభిమానులలో ఈ విషయం చాలా ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది.మరి వేణు స్వామి తెలియజేసినట్టుగా వీరిద్దరూ విడిపోతారా లేదా అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.