ఒకప్పటి కల్ట్ నాయక్ సంజయ్ దత్ ఇక ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిపోతున్నాడ అంటే అవును అనే సమాధానమే చెబుతున్నారు అందరూ. ఎందుకంటే ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా రాణించేవాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు. అయితే ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సినిమాలో అదిరా పాత్రలో సంజయ్ దత్ నటించాడు అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఏకంగా ఎంతో మంది దర్శకులు అతని కోసమే స్పెషల్గా ఒక పాత్రను రాసుకొని మరి హీరోని ఢీకొట్టే విధానం పాత్రలో అతని సినిమాలో పెట్టుకుంటున్నాడు.


 దీంతో బాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేదు  ప్రతి చోట కూడా సంజయ్ దత్ మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలోను అటు సంజయ్ దత్ నటించిన క్యారెక్టర్ బాగా పేలింది. అర్జున్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ పక్కన ఉన్న సంజు తన ఉనికిని చూపించుకోవడంలో ఎక్కడ తగ్గలేదు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం కేడి డెవిల్ అనే మరో కన్నడ పాన్ ఇండియా మూవీలోని సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు సంజయ్ ఏకంగా తెలుగు ఎంట్రీ కి కూడా సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందించిన సినిమాల్లో సంజయ్ దత్ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయినట్లే తెలుస్తోంది.


 ఇక ఇప్పటికే ముంబైలో లుక్ టెస్ట్ కూడా పూర్తయిందట  అయితే ఈ సినిమాలో పాత్ర కోసం సంజయ్ దత్ ఎంత పారితోషికం డిమాండ్ చేసిన కూడా ఇచ్చేందుకు నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదు అన్నది తెలుస్తుంది. అదే సమయంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభరా సినిమాలో కూడా కీలక పాత్ర కోసం అటు సంజయ్ దత్ ను సంప్రదిస్తున్నారు అన్న టాక్ కూడా ఉంది. కే జి ఎఫ్ లో రాఖీ బాయ్ నే భయపెట్టే అదీరా పాత్రలో కనిపించిన సంజయ్ దత్ ఇక ఇప్పుడు ప్రభాస్ తో తలబడుతూ ఉండడంతో ఆ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: