
ఈక్రమంలోనే నేచురల్ స్టార్ నాని... పూజాహెగ్డే కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని వార్తలు హైలెట్ అవుతున్నాయి. వరుస ఫ్లాపుల వల్ల ఈ మధ్య కాలంలో పూజాహెగ్డేకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఆమెను ఐరన్ లెగ్ అనే టాగ్ తో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈక్రమంలో తనను తాను నిరూపించుకునేందుకు పూజా హెగ్డేకు మరో ఛాన్స్ దక్కిందని అంటున్నారు. ఈ విషయంలో ఆమె ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.సిబి చక్రవర్తి డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్టు సమాచారం. డాన్ సినిమాతో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సిబి చక్రవర్తికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాన్ అక్కడి ఆడియన్స్ ను బాగా అలరించింది. అయితే ప్రస్తుతం నానితోఈ దర్శకుడు తెరకెక్కించే సినిమా పక్కా మాస్ గా ఉంటుందటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.