ప్రస్తుతం ఎక్కువగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తూ ఉండడంతో చాలా మంది సెలబ్రిటీలు సామాన్యులు కూడా వివాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల దిల్ రాజు సోదరుని తమ్ముడు ఆశీష్ రెడ్డి వివాహం కూడా చాలా గ్రాండ్గా జరిగింది.. అలాగే వైఎస్ షర్మిల రెడ్డి కుమారుడు రాజారెడ్డి వివాహం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. తాజాగా ప్రముఖ నటుడు కూడా సైలెంట్ గా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. మళయాల ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడుగా గుర్తింపు సంపాదించుకున్న సుదేవ్ నాయక్ వైవాహిక బంధంలోకి నిన్నటి రోజున అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది.


తన ప్రియురాలు ప్రముఖ నటి అయినటువంటి అమర్దీప్ కౌర్ తో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కేరళ సాంప్రదాయం పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితుల సమక్షంలో శ్రీదేవి అమర్దీప్ వివాహం జరిగింది. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆలయంలో పూజలు చేయించుకున్నటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సైతం ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


నటుడు సుదేవ్ నాయర్ 2014లో గులాబ్ గ్యాంగ్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మలయాళంలో నటుడు గానే కాకుండా ఇతర భాషలలో కూడా దాదాపుగా ముపైకిపైగా సినిమాలలో నటించారు. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో విలన్ గా కూడా మెప్పించారు. నితిన్ శ్రీ లీల జంటగా నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో కూడా విలన్ గానే మెప్పించారు.ఇలా సినిమాలోనే కాకుండా పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుదేవ్ నాయర్ వెబ్ సిరీస్లలో కూడా నటించారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఎటువంటి హడావిడి లేకుండా వీరి వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: