తెలుగమ్మాయి 'అంజలి' గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె 'షాపింగ్ మాల్' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే అంజలి నిజానికి తెలుగమ్మాయి అయినప్పటికి తమిళ్ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈమె తెలుగులో మొదటగా 2006లో వచ్చిన 'ఫోటో' అనే చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆ సినిమా అంజలీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'మసాలా' సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత 2014లో వచ్చిన కామెడీ అండ్ హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన 'గీతాంజలీ' సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఇప్పడు గీతాంజలి సినిమాకు సీక్వెల్ గాఅంజలి ప్రేక్షకుల ముందు అలరించనుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..టాలీవుడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్ లో నటించిన గీతాంజలి సినిమా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికి మర్చిపోలేరు. కామెడీ అండ్ హార్రర్ బ్యాక్ డ్రాప్ అలరించిన ఈ సినిమాకు సీక్వెల్ గా.. 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిచనున్నారు. ఈ సీక్వెల్ ను ఎంవీవీ సినిమా కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవి ప్రతిష్టాత్మాకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ స్పందన లభించడంతో పాటు బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ఓ అప్ డేట్ ఇచ్చింది.
ఈనెల అనగా ఫిబ్రవరి 24న 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే సరికొత్తగా ఈ సినిమాను బేగంపేట్ శ్శాశనవాటికలో టీజర్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా సోషల్ మీడియాలో గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ ఈవెంట్ ను 'బేగంపేట్ శ్శాశనవాటికలో' ఈ శనివారం రాత్రి 7 గంటలకు రిలీజ్ చేస్తునట్లు చిత్ర యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు వింతగా శ్మసనావాటికలో టీజర్ లాంచ్ ఏంట్రా బాబు అని కామెంట్స చేస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో చరిత్రలో ఎన్నాడు లేని విధంగా.. సరికొత్తగా ఈ ఈవెంట్ అనేది స్మశానవాటికలో నిర్వహించడం విశేషం.
ఇక గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో.. మొదట నటించిన నటులు అయిన శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ లతో పాటు సత్య, సునీల్, రవి శంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితర నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి, గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ రిలీజ్ శ్మశనావాటికలో నిర్వహించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: