ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ నాచురల్ స్టార్గా దగ్గరయ్యాడు నాని. అయితే వరుస సూపర్ హిట్లతో దూసుకుపోయిన నానీ మధ్యలో ఇక కొన్ని ఫ్లాప్ లతో సతమతమయ్యాడు  కానీ ఇప్పుడు మళ్లీ సూపర్ హిట్ లు కొడుతూ సక్సెస్ ట్రాక్ ఎక్కేసాడు. గత కొంతకాలం నుంచి వరుస విజయాలు సాధిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది దసరా అనే సినిమాతో హిట్టు కొట్టిన నాని.. ఇక ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్నాడు.


 ఇక ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాకి సంబంధించి ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ కు విశేషమైన ఆదరణ లభిస్తుంది అని చెప్పాలి.  సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే నాని ఇక ఈ సినిమా ముగిసిన తర్వాత హిట్ సీక్వెల్లో కూడా నటించాల్సి ఉంది. హిట్ 3 మూవీలో నానినే ప్రధాన పాత్రలో ఉంటాడని హిట్ 2 లోనే రివీల్ చేశాడు దర్శకుడు శైలేష్ కొలను.


 అయితే ఇప్పటికే హిట్ 1,2  సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నాని.. సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హిట్ 3తో కూడా చేసి సూపర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడట నానీ. అయితే శైలేష్ కొలను రీసెంట్గా వెంకటేష్ తో సైంధవ్ అనే మూవీ తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోతోంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా  డిజాస్టర్ అయ్యింది. దీంతో హిట్ త్రీ విషయంలో నాని కొన్ని కండిషన్స్ పెడుతున్నాడట. హిట్ త్రీ సినిమాకు సంబంధించిన నరేషన్ కూడా ఇచ్చాడట శైలేష్. కాగా కథ విషయంలో నాని కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక నాని చెప్పిన మాటలతో శైలేష్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారట. ఇక ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఈ మూవీ స్టేట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: