పుష్పని మించి పుష్ప-2ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ప్రతి ఒక్క సీన్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బెటర్మెంట్ కోసం కొన్ని సీన్లు రీషూట్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆడియన్స్ కు బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి సుకుమార్ చాలా కష్టపడుతున్నారు. కొన్ని నెలల నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ నిర్వహిస్తున్నారు. కచ్చితంగా అనుకున్న తేదీకే అంటే ఆగస్టు 15 వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది పుష్ప మూవీ టీమ్.పుష్ప-2 విడుదలకు ఇంకా 150 రోజులే ఉంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తవ్వనుందట. వెంటనే పాన్ ఇండియా స్థాయిలో సినిమాకి ప్రమోషన్లు నిర్వహించనున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. అన్ని పనులు స్పీడ్ గా జరిగిపోతున్నాయట. డైరెక్టర్ సుకుమార్ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారట. దీంతో ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజవ్వడం పక్కా అని సమాచారం తెలుస్తుంది.ఇక  ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే అన్న విషయం తెలిసిందే.


దీంతో ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. గత సంవత్సరం బర్త్ డేకు టీజర్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. ఇప్పుడు పాటను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట. అయితే పుష్ప-1 మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సీక్వెల్ మ్యూజిక్ పై  భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాపై బాహుబలి-2 రేంజ్ లో హైప్ నెలకొంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకపోతే పుష్ప-2.. బాహుబలి-2 తో పాటు ఎన్నో రికార్డులు బద్దలుకొట్టనుంది. అయితే ఆగస్టు 15న పలు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కమల్ హాసన్ ఇండియన్-2, దళపతి విజయ్ గోట్ తోపాటు బాలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్ సింగం-3 విడుదలవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరి వీటిలో ఒక్క సినిమా అయిన బ్లాక్ బస్టర్ హిట్ అయితే పుష్ప 2 రికార్డులు కొట్టడం కష్టం.మరి చూడాలి పుష్ప రాజ్ మ్యాజిక్ ఈసారి ఎలా పని చేస్తుందో. ఒకవేళ పుష్ప 2 కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే అన్ని రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: