అల్లు అర్జున్ ఇంకా సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ గత రెండేళ్లుగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.వచ్చే ఆగస్టు నెలలో సినిమా విడుదల అవ్వబోతున్న సంగతి తెల్సిందే. పుష్ప 2 సినిమా విడుదల విషయంలో కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా షూటింగ్‌ కూడా చాలా పెండింగ్ ఉంది. అంతే కాకుండా ఐటెం సాంగ్ విషయంలో కూడా క్లారిటీ రాలేదు. ఏ హీరోయిన్ తో ఐటెం సాంగ్‌ చేయించాలి అనే విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పుష్ప 2 ను ఆగస్టు 15న విడుదల చేయడం సాధ్యమేనా అనే అనుమానాలను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కారణంగా వాయిదా పడబోతున్న కల్కి సినిమాను కూడా ఆగస్టు నెలలో విడుదల చేసే విధంగా వైజయంతి మూవీస్ వారు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది.


రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా కనుక ఆగస్టు నెలలో విడుదల అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ విషయంలో మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప టీం మెంబర్స్ విడుదల విషయంలో అనధికారికంగా మీడియాకు లీక్‌ కూడా ఇచ్చారు. ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ప 2 సినిమా విడుదల అవ్వడం ఖాయం. ప్రభాస్‌ కల్కి సినిమా తో వచ్చినా కూడా పుష్ప 2 పాన్‌ ఇండియా రేంజ్‌ లో ముందుగా అనుకున్న తేదీకి అంటే ఆగస్టు 15న ఖచ్చితంగా విడుదల చేసి తీరుతాం అంటూ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతున్నారట. ఇంకా రెండు మూడు రోజుల్లో కల్కి సినిమా కొత్త విడుదల తేదీ విషయంలో స్పష్టత వస్తుందని అంటున్నారు. ఇలాంటి టైంలో పుష్ప 2 మూవీ టీం నుంచి రిలీజ్ విషయమై మరింత క్లారిటీ రావడంతో కల్కి సినిమా నిర్మాతలు ఆ దిశగా తమ రిలీజ్ డేట్‌ ను ప్లాన్‌ చేసుకుంటారేమో చూడాలి.ఏది ఏమైనా కానీ వచ్చే ఆగస్ట్ నెలలో కల్కి, పుష్ప 2 మధ్య గట్టి క్లాష్ ఏర్పడేలా ఉంది.మరి చూడాలి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు నమోదు చేస్తుందో..ఒకవేళ క్లాష్ కి దిగితే రెండు సినిమాలకు రికార్డు వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: