ఇండియా వ్యాప్తంగా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య కు ఈమెకు నిశ్చితార్థం జరిగింది. దానితో ఈమె పేరు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. దానితో ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ..? ఈమె కెరియర్ ఎలా మొదలు పెట్టింది ..?   ఎలాంటి సినిమాలలో నటించింది ..? ఆ సినిమాలు ఏ స్థాయి విజయాలను సాధించాయి ..? ఇలా అనేక విషయాల గురించి జనాలు తెలుసుకోవడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. మరి ఈమె కెరియర్ ఎలా మొదలయ్యింది. చైతూతో నిశ్చితార్థం వరకు ఈమె కెరియర్ లో జరిగిన పరిణామాలు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

శోభితా ధూళిపాళ్ల చూడడానికి ఫరాన్ అమ్మాయిలా కనిపించిన ఈమె అచ్చమైన తెలుగు అమ్మాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో ఈమె జన్మించింది. వేణుగోపాలరావు , శాంతారావు దంపతులకు తెనాలి లో శోభిత జన్మించింది. ఈమె బ్రాహ్మణ కుటుంబం అమ్మాయి. ఈమె తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్ గా పని చేశారు. తల్లి గవర్నమెంట్ టీచర్. ఇకపోతే ఈమె మడల్ గా కెరియర్ ను మొదలు పెట్టింది.


అందులో భాగంగా 2013 వ సంవత్సరంలో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఈమె పాల్గొంది. అందులో భాగంగా ఈమె ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ను గెలుచుకుంది. ఆ తర్వాత భారతదేశం తరపున మిస్ ఎర్త్ 2013 పోటీల్లో కూడా శోభిత పాల్గొంది. కానీ అక్కడ ఈమె టైటిల్ గెలవలేకపోయింది. ఆ తర్వాత 2016 లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈమెకు మొదటి అవకాశం అనురాగ్ కశ్యప్ ఇచ్చాడు. 2016 లో ఆయన తీసిన "రామన్ రాఘవ్ 2.0" సినిమాలో ఈమె అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె అనేక సినిమాలలో ఇప్పటి వరకు నటించింది. ఇకపోతే తాజాగా ఈమెకు నాగ చైతన్య తో ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొన్ని రోజుల్లోనే వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: