తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో త్రినాథ్ రావు నక్కిన ఒకరు . ఈయన సినిమా చూపిస్తా మామ మూవీ తో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన నేను లోకల్ , హలో గురు ప్రేమ కోసమే , ధమాకా మూవీలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా ఈయన సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్గా మజాకా అనే మూవీ ని రూపొందించాడు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా త్రినాథ్ రావు నక్కిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయనకు మీరు వెంకటేష్ తో సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేశారట అది నిజమేనా ... ఒక వేళ నిజం అయితే ఎందుకు ఆ సినిమా మిస్ అయింది అనే ప్రశ్న ఈ దర్శకుడికి ఎదురయింది. దానికి త్రినాధ్ రావు నక్కిన సమాధానం ఇస్తూ ... వెంకటేష్ గారితో సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేశాను. ఆయనకు అందులో భాగంగా ఓ కథను కూడా వినిపించాను. ఆయనకు ఆ కథ కూడా బాగా నచ్చింది. సినిమా కథ మొత్తం సూపర్ గా వచ్చింది.

కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం మేము అస్సలు సాటిస్ఫై కాలేదు. ఆ క్లైమాక్స్ కోసం అనేక వర్షన్స్ కూడా అనుకున్నాం. కానీ ఏది దానికి సెట్ కావడం లేదు. దానితో ఇద్దరం కూడా ఆ కథను పక్కన  పెట్టేసాం. దానితో మా ఇద్దరి కాంబోలో సినిమా రాలేదు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా త్రినాథ్ రావు నక్కిన సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: