టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోలుగా ఏ మేరకు సక్సెస్ అవుతున్నారో విలన్లు కూడా అదే విధంగా సక్సెస్ సాధిస్తున్నారు. ప్రతి ఒక్క సినిమాలో హీరోకు సమానంగా విలన్ పాత్రను రూపొందిస్తున్నారు. హీరోలకు మించి విలన్లు సినిమాలలో సక్సెస్ సాధిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో దసరా మూవీ విలన్ షైన్ టామ్ చాకో ఒకరు. ఈ హీరో దసరా సినిమాలో విలన్ పాత్రను పోషించి మంచి గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమాలో ఈ హీరోకి విపరీతంగా గుర్తింపు లభించింది.


ఎంతోమంది షైన్ టామ్ చాకో నటనను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోకు సంబంధించి ఓ వార్త హల్చల్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి వార్తలలో నిలుస్తున్న షైన్ టామ్ చాకో ఈరోజు అరెస్ట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఈరోజు ఉదయం 10: 15 గంటల సమయంలో అతడిని నార్త్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల రెండు రోజుల క్రితం షైన్ టామ్ చాకో హోటల్ నుంచి తప్పించుకొని పారిపోయాడు.

ఇతని కోసం దాదాపు పోలీసులు 48 గంటల పాటు సెర్చ్ చేయగా రెండు రోజుల తర్వాత షైన్ టామ్ చాకో పోలీసులకు లొంగిపోయాడు. షైన్ టామ్ చాకోను పోలీసులు అరెస్ట్ చేసి అతడి ఫోన్ సీజ్ చేశారు. షైన్ టామ్ చాకో కాల్ లిస్ట్, గూగుల్ పే లావాదేవీలను పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇప్పటికే షైన్ టామ్ చాకోపై కేసు నమోదు చేయడానికి పోలీసులకు తగిన ఆధారాలు లభించినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం షైన్ టామ్ చాకో వివిధ సినిమాలలో అవకాశాలను అందుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు సెర్చ్ చేస్తున్నారట. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: