చిత్ర పరిశ్రమలోకి రోజురోజుకి కొత్త కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉన్నారు. ఇక ఒకప్పటి హీరోయిన్లు వారి నటన అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకునేవారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటించేవారు. ఇక అలాంటి వారిలో నటి విజయశాంతి ఒకరు. లేడీ సూపర్ స్టార్ గా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను విజయశాంతి ఎంతగానో ఆకట్టుకుంది. విజయశాంతి చిత్రపరిశ్రమకు పరిచయమై చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా సినిమాలలో నటిస్తున్నారు. 


ఇక హీరోయిన్ గా విజయశాంతి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన విజయశాంతి కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరమయ్యారు. విజయశాంతి కేవలం సినిమాలో మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ తన వంతు పాత్రను నిర్వహించారు. ఇక విజయశాంతికి 2014 సంవత్సరంలో ఎన్నికల అనంతరం తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి సర్జరీ చేయించుకుందట.


ఇక మళ్లీ తిరిగి కోల్పోవడానికి విజయశాంతికి చాలా సమయం పట్టిందని అందుకే కొంతకాలం పాటు సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉన్నట్టుగా విజయశాంతి తెలియజేశారు. నా జీవితాన్ని నా ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతోనే మేము పిల్లల్ని కనకూడదు అని డిసైడ్ అయినట్లుగా విజయశాంతి వెల్లడించారు. నా మరణానంతరం నా ఆస్తి మొత్తం ప్రజలకు చెందే విధంగా చర్యలు తీసుకుంటానని విజయశాంతి చెప్పారు. తన తల్లి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్య, వైద్యం కోసం తన ఆస్తిని కేటాయిస్తానని విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇప్పటికే నా దగ్గర ఉన్న నగలు అన్నింటిని వెంకటేశ్వర స్వామి హుండీలో వేసినట్లుగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తెలిపారు. ప్రస్తుతం విజయశాంతి షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విజయశాంతి షేర్ చేసుకున్న ఈ విషయం పైన చాలామంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చాలా గొప్ప మనసు విజయశాంతికి ఉందని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: